![]() |
![]() |

తమన్నా సింహాద్రి శ్రీముఖితో ఎక్కువగా అవుట్ డోర్స్ కి వెళ్లే ఒక వ్యక్తిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ తెలుసు. శ్రీముఖితో వాళ్ళ అమ్మతో ఈమె ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో రకరకాల రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి తమన్నా సింహాద్రి తెలుగు సీరియల్స్ గురించి, బిగ్ బాస్ గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. "తెలుగు సీరియల్స్ చూడండి, తెలుగు బిగ్ బాస్ చూడండి...తెలుగు వాళ్ళు కనిపించరు..అందరూ కన్నడ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. అదే బాలీవుడ్ బిగ్ బాస్ చూడండి వాళ్ళ వాళ్ళే ఎక్కువగా ఉంటారు. నేను హిందీలో అనర్గళంగా మాట్లాడగలను, కంటెంట్ ఇవ్వగలను కానీ వాళ్ళు నన్ను తీసుకుంటారా తీసుకోరు. కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిలను పక్కనపెట్టేసి కన్నడ వాళ్లనే ఎక్కువగా తీసుకుంటారు. మన వాళ్లకు ఎప్పుడూ పక్కింటి పుల్లకూర రుచిగా ఉంటుంది. నిజం ఏదైనా కానీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే నాకు అలవాటు. బిగ్ బాస్ వలన నేను చాలా బ్యాడ్ అయ్యాను. కాంట్రవర్షియల్ అయ్యాను, అలాగే పబ్లిక్ లో కూడా చాలా బ్యాడ్ అయ్యాను.

నేనేంటో చిరంజీవి గారు, శ్రీముఖి గుర్తించారు. నిజాయితీగా ఉన్నానన్న విషయాన్ని కొంతమందన్నా గుర్తించారు. అది హ్యాపీ నాకు. కన్నడ వాళ్ళు అక్కడ, ఇక్కడ సంపాదించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రములో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళం మేము అడుక్కుతినాల ? శోభా శెట్టి ఇక్కడ బిగ్ బాస్ లో కన్నడ బిగ్ బాస్ లోకి వెళ్ళింది. ఎం కంటెంట్ ఇస్తున్నారు వాళ్ళు ? ఎం పగలదీస్తున్నారు వాళ్ళు ? ఆంధ్రా ప్రజలు ఎక్కుగా నాటకాలకు, అబద్ధాలకు అట్ట్రాక్ట్ ఐపోతారు. బిగ్ బాస్ లో చేసే వాళ్లంతా రియాలిటీ కాదు అంతా నటన.. ఆ పల్లవి ప్రశాంత్ ఏంటి అతను అంతా నటనే కదా...నేను కూడా ఒక ట్రాన్స్ ఫిమేల్ ని అని చెప్పి నిద్ర లేచిన దగ్గర నుంచి దండాలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటే టాప్ 5 లో ఉండేదాన్ని." అంటూ చెప్పుకొచ్చింది తమన్నా సింహాద్రి.
![]() |
![]() |